ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ తో ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు

ఇక్కడ అయిల్ పామ్ ఫ్యాక్టరీ తో 500 మందికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని ,ఆయిల్ ఫామ్ తో ఎన్నో లాభాలు ఉన్నాయని ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం భీమారo మండల కేంద్రంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ తో కలిసి ఆయిల్ ఫామ్ నర్సరీని సందర్శించారు.

ఈ సందర్భంగా నర్సరీలో పెంచుతున్న మొక్కలను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ… భీమారo మండలంలోని మద్దికల్ గ్రామంలో మ్యాట్రిక్స్ కంపెనీ వారు 70 ఎకరాల భూమిని ఇప్పటికే తీసుకున్నట్లు వారు తెలిపారు. అక్కడ ఎనిమిది లక్షల మొక్కలను పెంచనున్నట్లు వారు తెలిపారు. భీమారం నర్సరీలో ఇప్పటికే 22 ఎకరాల్లో ఆయిల్ పామ్ నర్సరీని,ఏర్పాటు చేసినట్లు ఆయిల్ పామ్ నర్సరీ ప్రతినిది ఉదయ్ కుమార్ తెలిపారు.ప్రతి ఒక్కరు ఆయిల్ పామ్ ఏర్పాటుకు ముందుకు రావాలని సూచించారు. భీమారo సర్పంచ్ గద్దెరామ్ రెడ్డి కి చెందిన ఏడెకరాల భూమి లో నర్సరీ ఏర్పాటు చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కలగూర రాజ్ కుమార్ ,సర్పంచ్ సంతోషం భాస్కర్ రెడ్డి ,మాజీ జెడ్ పిటిసి జర్పుల రాజ్ కుమార్ నాయక్ , నియోజకవర్గ స్థాయి నాయకులు వేముల శ్రీకాంత్ గౌడ్ దాసరి మదునయ్య ,రాజేశ్వర్ రెడ్డి ,జనం పల్లి సమ్మయ్య ,జలంపల్లి తిరుపతి సోషల్ మీడియా ఇంచార్జ్ రమేష్ గౌడ్ , యువ నాయకులు వేముల ప్రణీత్ గౌడ్ , బండి సంపత్ ,గోపాల్ ముదిరాజ్ ,వడ్ల కొండ పవన్ తదితరులు పాల్గొన్నారు.