మరణమంటే భయమేలేదు.. తన సమాధి తానే నిర్మించుకున్నాడు.. ఓ పోలీస్ స్టోరీ ఇది..!

మరణం మానవ సహజం… పుట్టేట్టపుడు ఏమి తీసుకురారు.., పోయేటప్పుడు ఏమి ఎత్తుకొని వెళ్లలేరన్నది అక్షర సత్యం. మనం రాత్రి పగలు అంటూ తేడాలేకుండా శ్రమించి కష్టించి… సంబంధించినదంతా మన సొతం కాదు. స్మశానంలో ఆరు అడుగుల స్థలం, మట్టి మాత్రమే మన సొతం అంటున్నాడు ఓ రిటైర్డ్ పోలీస్. ఎలా మరణిస్తామో తెలియదు. మరణించిన అనంతరం ఎక్కడ ఖననం చేస్తారో చూడలేము. మరణించిన వ్యక్తి స్మారకంగా సమాధులు అందరూ నిర్ణయిస్తారు. అందులో ఎలాంటి అదిసయోక్తి లేదు. కానీ ఆ రిటైర్డ్ పోలీస్ మాత్రం తాను చనిపోక ముందే తన సమాధిని నిర్మించుకున్నాడు. అంతేకాదు ఉదయం నుంచి సాయంత్రం వరకు సమాధి వద్దనే ఉంటూ కాలక్షేపం చేస్తున్న వింతైన ఘటన ఇది. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పాటూరు గ్రామంలో నివాసం ఉంటున్నాడు షేక్ ముజీబ్ సాహెబ్(72). కటిక పేదరికంలో పుట్టిన సాహెబ్ చదువుపై మక్కువతో ఎన్నో కష్టాలుపడి 1973లో బీఏ పూర్తి చేశాడు.