మాతా శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.

  • తల్లి బిడ్డ క్షేమం..
    మహిళల కోసం సంక్షేమంతో ముందుకు సాగుతున్నాం.
  • ప్రభుత్వ విప్ బాల్క సుమన్
  • కేసీఆర్‌ పౌష్టికాహార కిట్‌” పథకాన్ని ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖానాలో లాంఛనంగా ప్రారంభించిన ప్రభుత్వ విప్ & చెన్నూర్ ఎమ్మెల్యే, బాల్క సుమన్

మహా వెలుగు , ఆసిఫాబాద్ డిసెంబర్ 21 : మాతా శిశు సంరక్షన కు తెలంగాణ ప్రభుత్వo సంక్షేమంతో ముందుకు సాగుతున్నామని ,ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. గర్భిణీ స్త్రీలలో రక్తహీనత తగ్గించడంతోపాటు పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న నూతన పథకం కేసీఆర్‌ పౌష్టికాహార కిట్‌” ను జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మీ , శాసనసభ్యులు ఆత్రం సక్కు కోనేరు కోనప్ప , ఎమ్మెల్సీ దండే విఠల్ , కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ చాహత్ బాజ్ప లతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా కార్యక్రమంలో విప్ సుమన్ మాట్లాడుతూ…నేడు మరో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టిందని తొలి విడతలో భాగంలో జిల్లాలోని 22 PHC సెంటర్ల పరిధిలోని 4014 మంది గర్భిణులకు కిట్ల పంపిణీ చేయనున్నట్లు వారు తెలిపారు. కేసీఆర్‌ కిట్‌ సూపర్‌ హిట్‌ కాగా, ఇదే స్ఫూర్తితో కేసీఆర్‌ న్యూట్రీషన్‌ కిట్లకు రూపకల్పన చేసిందన్నారు.కేసీఆర్ కిట్ పుట్టిన బిడ్డ కోసం.. కేసీఆర్ న్యూట్రిషన్ కి పుట్టబోయే బిడ్డ కోసం.

అమ్మతనంలో ఉన్న మాధుర్యం మాటల్లో చెప్పలేనిదని నేటి నుంచి 9 జిల్లాల్లో కిట్లు పంపిణీ, రేపటి ఆరోగ్య తెలంగాణనే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. అత్యధికంగా ఎనీమియా (రక్త హీనత) ప్రభావం ఉన్న 9 జిల్లాలు ఆదిలాబాద్‌, భ‌ద్రాద్రి కొత్తగూడెం, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, జోగులాంబ గ‌ద్వాల్‌, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ములుగు, నాగ‌ర్ క‌ర్నూల్‌, వికారాబాద్ ల‌లో ఈ కిట్లను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తుందని తెలిపారు.1.25 లక్షల మంది గ‌ర్బిణుల‌కు ఉప‌యోగ‌ప‌డనుందని మొత్తంగా రెండున్నర లక్షల కిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. దీని కోసం ప్రభుత్వం రూ. 50 కోట్లు ఖర్చు చేస్తున్నదన్నారు. ప్రోటీన్స్‌, మిన‌ర‌ల్స్‌, విట‌మిన్స్ ల‌ను పోష‌కాహారం ద్వారా అందించి ర‌క్త హీన‌త త‌గ్గించ‌డం, హీమోగ్లోబిన్ శాతం పెంచ‌డం న్యూట్రీషన్‌ కిట్ల లక్ష్యం , ఒక్కో కిట్‌కు రూ. 1962
13-27 వారాల మధ్య జరిగే రెండో ఏఎన్‌సీ చెకప్‌ సమయంలో ఒకసారి, 28-34 వారాల మధ్య చేసే మూడో ఏఎన్‌సీ చెకప్‌ సమయంలో రెండో సారి ఈ కిట్లను ఇవ్వడం జరుగుతుందని , 9 జిల్లాల్లోని 231 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ప్రభుత్వం ఈ పంపిణీ చేస్తోందని విప్ స్పష్టం చేశారు.

న్యూట్రీషన్‌ కిట్లలో ఉండేవి…కిలో న్యూట్రీష‌న్ మిక్స్ పౌడ‌ర్కి ,లో ఖ‌ర్జూర‌ ,ఐర‌న్ సిర‌ప్ 3 బాటిల్స్‌, 500 గ్రాముల నెయ్యి, ఆల్‌బెండ‌జోల్ టాబ్లెట్‌ , కప్పు , ప్లాస్టిక్ బాస్కెట్ , ఎనీమియా నివారించడం వల్ల మాతృ మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు 13,90,634 మంది ల‌బ్ధిదారులకు, రూ. 243 కోట్లు విలువ చేసే 12,85,563 కేసీఆర్ కిట్లు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు.

కేసీఆర్‌ కిట్‌ పథకం కోసం ఇప్పటి వరకు రూ. 1500 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు ప్రభుత్వ దవాఖానాల్లో తెలంగాణ ఏర్పడ్డ నాడు 30శాతంగా ఉన్న ప్రసవాలు ఇప్పుడు 66 శాతానికి చేరాయని , ప్రతి ఆడబిడ్డ తెలంగాణ బిడ్డ అనుకుని.. ప్రతి సంవత్సరం 37 వేల మంది ఇతర రాష్ట్రాల మహిళలకు ప్రసవాలు చేస్తున్నామని ఇందులో మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్ ఘడ్ వారు ఎక్కువని రాష్ట్రంలో ఏటా 6.50 లక్షల ప్రసవాలు, ఇందులో 62% ప్రభుత్వ దవాఖానాలోనే.
ఒక బిడ్డ పుడితే 12 వేలు .. ఆడబిడ్డకు 13 వేలు ఇస్తున్న ఏకైక సర్కార్ బిఆర్ఎస్ సర్కారని కొనియాడారు.

ప్రసవ సమయంలో 16 రకాల వస్తువులతో కేసిఆర్ కిట్ఇప్పటివరకు రాష్ట్రంలో 22 మాత శిశు కేంద్రాలు ప్రారంభిoచినట్లు వారు తెలిపారు. 672 ప్రసూతి కేంద్రాల అభివృద్ధి , మహిళల అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని ,ఒంటరి మహిళ ,వితంతు పెన్షన్లు, కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, ఆరోగ్య లక్ష్మి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, షీ టీమ్స్ పథకాలు మహిళల కోసం తీసుకొచ్చిన ఘనత కేసీఆర్దేనని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.