- ఉప్పరగూడెం లో సన్నాహక సమావేశంలో.
- డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బాద్యుల్లు
మాలోతు నెహ్రూ నాయక్.
మహావెలుగు కురవి/ ఏప్రిల్ రిపోర్టర్ చల్ల వేణు 29 : కురవి మండలంలోని ఉప్పరగూడెం గ్రామంలో రైతు సన్నాహక సమావేశాన్ని డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాలోత్ నెహ్రూ నాయక్ శుక్రవారం నిర్వహించి మాట్లాడారు. వరంగల్ లో జరిగే రైతు సంఘర్షణ సభ కు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని, ఈ సభకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ పాల్గొంటారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు, తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పుకుంటూ అప్పులు తెలంగాణ గా మార్చిన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ , తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్రాన్ని సహకారం చేసిన కాంగ్రెస్ పార్టీ “రైతు సంఘర్షణ” సభ వరంగల్ పట్టణంలో జరుగుతుందని ,ఈ సభను విజయవంతం చేయాలని శుక్రవారం సన్నాహక సభలో వివరించారు.
ఈ సమావేశానికి పెద్ద ఎత్తున రైతులు,రైతు సంఘాలు, యువకులు, రైతు కూలీలు, మేధావులు, విద్యార్థులు తరలి రావాలని, పార్టీ కార్యకర్తలు అధిక ఉత్సాహంతో పని చేయాలని తెలిపారు , టిఆర్ఎస్ పార్టీ విధానాలు నచ్చక కొంతమంది కాంగ్రేస్ పార్టీ లో చేరారని తెలియజేశారు.
ఈ సమావేశంలోనాయకులు నారాయణ , వెంకటరెడ్డి ,ప్రభాకర్ రెడ్డి ,తేజు నాయక్,శివ నాయక్,రాందాస్ నాయక్,మాలోతు సురేష్,వార్డు సభ్యులు , మహిళలు పాల్గొన్నారు.
