వి. కపిల్ కుమార్ మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్ మహబూబాబాద్/ బయ్యారం 01: భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు, సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా బయ్యారం మండల కమిటీ ల ఆధ్వర్యంలో ఈరోజు బయ్యారం మండలంలోని 137వ, మేడే ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బయ్యారం మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం పై జక్కుల యాకయ్య జండాఎగరవేయగా,కాంచనపళ్లి అమరవీరుల స్థూపంపై జగన్న జండా ఎగరవేశారు .
ఐ.ఎఫ్.టి.యు దిమ్మె పై బిళ్ళకంటి సూర్యం జండా ఎగరవేయడం జరిగింది. ఇరుసులాపురం అమరవీరుల స్తూపం పై కాశమల్ల వెంకన్న జెండా వేయగా కోటగడ్డ లో బుచ్చమ్మ,కొత్తపేట లో సత్యం జెండాను ఎగరవేశారు. అనంతరం ఈ కార్యక్రమం ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మహబూబాబాద్ డివిజన్ కార్యదర్శి జగ్గన్న ,
భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బిళ్ళకంటి సూర్యం లు మాట్లాడుతూ..
మనిశి శ్రమను దోపిడి చేసే పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా ఎనిమిది గంటల పని దినం సాధించుకున్న మేడే స్ఫూర్తితో కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. చికాగో నగరంలో పెట్టుబడిదారీ వర్గానికి వ్యతిరేకంగా కార్మికులు తమ హక్కుల కోసం ఎంతోమంది కార్మికులు అసువులు బాసిన సందర్భం లో నేడు కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు నష్టపరిచే నాలుగు లేబర్ కోడ్ల కు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు.
కార్మిక సంఘాలు సాధించుకున్న చట్టాలను తుంగలో తొక్కి, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలను తీసుకు వచ్చి, కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారనారు.
ఈ నాలుగు లేబర్ కోడ్స్ కార్మిక హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయన్నారు. మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకు వస్తే రైతన్న ఢిల్లీ నడిబొడ్డున ఆ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించి0తే మోడీ ప్రభుత్వం తల వంచి ఆ చట్టాలను రద్దు చేసిందన్నారు.
అలానే కార్మిక వర్గాని నష్టపరిచే నాలుగు లేబర్ కోళ్లను ఉపసంహరించుకునే అంతవరకు కార్మికవర్గం ఉద్యమాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మహబూబాబాద్ డివిజన్ నాయకులు ఉమ్మగాని సత్యం,
బయ్యారం మండలం నాయకులు కత్తి అశోక్,
జక్కుల యాకయ్య, ఐ.ఎఫ్.టి.యు బ్రాంచ్ నాయకులు పూజ లచ్చయ్య, జక్కుల అశోక్, గుర్రం పూర్ణ, శీలంశెట్టి వెంకన్న, రాందాస్,
ఎస్ కే జానీ ,మేకపోతుల శీను, వెంకన్న, కోమెరా కృష్ణ, సోమన్న, కేశ లింగయ్య, గుడిమెట్ల శ్రీను, కూరపాటి నరసయ్య, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.