- సాధుల శ్రీనివాస్
సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి
వి. కపిల్ కుమార్ మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్ మహబూబాబాద్.01: మేడే స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సన్నద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆదివారం 137వ,మేడే ఉత్సవాల్లో భాగంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయం ముందు జెండా ఎగరవేయడం జరిగింది.
అనంతరం పార్టీ కార్యాలయం నుండి వ్యవసాయ మార్కెట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన అనంతరం సిపిఎం, సి ఐ టి యు ఆధ్వర్యంలో సభలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాద రాజకీయాలను చేస్తుందని కార్మికులను, కర్శకులను కులాల పేరు మీద, మతాల పేరుమీద విభజించి కార్మికుల హక్కులను నాశనం చేస్తూ కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం కొత్త చట్టాలను తీసుకు వస్తుందని .. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని దేశంలో రైతులు ఐక్యంగా పోరాడి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసుకున్నారని, అదేవిధంగా కార్మికులు కులమతాల పేరుతో కార్మికులు విడిపోకుండా ఐక్య పోరాటాలు చేసి కార్మిక హక్కుల ను రక్షించుకోవాలని స్వాతంత్రం వచ్చిన తర్వాత కార్మికులు పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను కేంద్ర BJP ప్రభుత్వం కోడ్ల పేరుతో చట్టాలను నిర్వీర్యం చేసే కుట్రలు పన్నుతున్నారని .. కార్మికులు రక్తం చిందించి సాధించుకున్న.. చట్టాలను,హక్కులను రక్షించుకోవాలని కార్మిక అభివృద్ధి కోసం కొత్త చట్టాలను తెచ్చుకోవాలని దానికై కార్మికులు దేశంలో ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా మత విద్వేషాలు రెచ్చగొడుతూ పౌర హక్కుల పై దాడి చేస్తూ ప్రజాస్వామ్య విలువలను సైతం నాశనం చేస్తుంనారని, బిజెపి చేస్తున్న ఈ వికృత చేష్టలను ఆపాలంటే దేశంలో ఉన్న ప్రజలు కార్మికులు మేధావులు ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఇప్పుడిప్పుడే కరోనా నుండి కోలుకుంటున్నా.. ప్రజలు ఆర్థికంగా నష్టపోయారని అయినా ప్రభుత్వం ప్రజలపై భారాలు వేస్తూ పెట్రోల్,డీజిల్ , గ్యాస్ ధరలు రోజువారీగా పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతోందని మరోవైపు నిత్యావసర ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయని వాటిని అదుపు చేయలేక కంపెనీల లాభాల కోసం కేంద్ర బిజెపి ప్రభుత్వం చూస్తుందని, మరోవైపు ప్రైవేటీకరణ పేరుతో ప్రజల ఆస్తులను ప్రవేట్ పరం చేస్తుందని కావున దేశంలో అన్ని వర్గాల ప్రజలు ఐక్యమై పోరాటం చేసి బిజెపి ని గద్దె దించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆకుల రాజు, సూరణపు సోమయ్య, నాయకులు సమ్మెట రాజమౌళి, కుంట ఉపేందర్, గాడి పెళ్లి ప్రమీల,కుర్ర మహేష్ ,రావుల రాజు, మల్లయ్య, హేమ నాయక్, చీపిరి యాకయ్య, కుమ్మరి కుంట నాగన్న, శ్రీనివాస్ రెడ్డి, చాగంటి భాగ్యమ్మ, సుర్ణపు సావిత్రి ,బానోతు పద్మ తదితరులు పాల్గొన్నారు.
సిపిఎం ఆధ్వర్యంలో పట్టణంలో 25 సెంటర్లలో జెండా ఆవిష్కరణ లు జరిగాయి. వివిధ సెంటర్లలో జరిగిన ఎర్ర జెండా ఆవిష్కరణలు సిపిఎం, సి ఐ టి యు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.