మహా వెలుగు గోదావరిఖని 28 : మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ను డైరెక్టర్ ఆపరేషన్స్ ఎస్. చంద్రశేఖర్ సోమవారం సందర్శించారు.ఈ సందర్బంగా మేడిపల్లి ఉపరితల గనిలో ఎన్ టి పి సి కి సంబందించిన ఫ్లై యాష్ ను నింపుటకు సంబందించి అధికారులతో చర్చించారు . అదే విధంగా మేడిపల్లి ఉపరితల గనికి సిఏ ల్యాండ్ సంబందించిన భూమిని ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ కు అందించుటకు సంబందించి చర్చించారు. మేడిపల్లి ఉపరితల గని M sand (Manufactured Sand) ను క్వాలిటీ టెస్ట్ చేసి ఇసుక క్వాలిటీ పరిశీలించాలని సూచించారు. పి ఓ బి మరియు M sand లకు విధ్యుత్ మరియు నీటి సరఫరా కు సంబందించి జీఎం శ్రీ కె . నారాయణ తో చర్చించారు .
ఈ కార్యక్రమం లో ఆర్ జి 1 ఏరియా జీఎం కె . నారాయణ గారు ,ఏరియా ఇంజనీరు జగన్ మోహన్ రావు , ఏరియా సర్వే అధికారి సరోత్తమ్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
