తమ అమ్మ కు కార్పొరేట్ వైద్యం అందజేస్తామని , తాము సీపీఐ పార్టీ ని విడిచి , టీఆరెస్ పార్టీ లో చేరాలని బెల్లంపల్లి సింగరేణి ఏరియా వైద్యులు తెలిపారని , సింగరేణి అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తో ఒక కార్మికుడు తల్లి మరణించిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రెడ్డి సారయ్య అనే సింగరేణి కార్మికుడు బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ లో “కుక్ “గా విధులు నిర్వహిస్తుంటారు. తన తల్లి రెడ్డి రత్నమ్మ కు హెల్త్ బాలెందున 29 రోజున సింగరేణి ఏరియా హాస్పిటల్ కు తీసుకవచ్చారు. ఆసుపత్రిలో అడ్మిట్ చేశాడు. ఇంత వరకు బాగానే ఉన్నా..
హాస్పటల్ సిబ్బంది మాత్రం మీ తల్లిని కార్పొరేట్ హాస్పిటల్ లో మంచి వైద్యం అందిస్తామని ,నీవు వెంటనే సిపిఐ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరాలని లేకపోతే ట్రీట్మెంట్ ఇవ్వమని సారయ్యను బెదిరించారని బాధితుడు తెలిపాడు.మా అమ్మని బతికించండి అని ఎంతగానో ప్రాధేయపడ్డా హాస్పటల్ సిబ్బంది సహాకరించక పోవడం వల్లే మా అమ్మ రెడ్డి రత్నమ్మ చనిపోయిందని తన చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సారయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఏరియా ఆసుపత్రిలో పని చేసే సిబ్బంది నిర్లక్ష్యం , అహంకారం, దుర్మార్గపు చర్యల వల్లే తమ తల్లి మరణించినట్లు వారు తెలిపారు. వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని పార్టీల నాయకులు కాంగ్రెస్, సిపిఐ.
వైఎస్ఆర్టిపి , తెలుగుదేశం నాయకులందరూ కలిసి హాస్పిటల్ సూపర్డెంట్ కు వినతిపత్రం ఇచ్చి జరిగిన సంఘటన పై వెంటనే విచారణ జరిపించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే హాస్పిటల్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఇందులో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ,మహమ్మద్ అఫ్జల్ ముచ్చర్ల మల్లయ్య బెల్లంపల్లి పట్టణ మాజీ అధ్యక్షులు ,గెల్లీ జయరాం యాదవ్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కుమార్ శంకర్ నాయకులు సిపిఐ పార్టీ నాయకులు AITUC చీప్ప నరసయ్య ,రత్నం ఐలయ్య ,శ్రీధర్ హాస్పిటల్ AITUCసిసెక్రెటరీ ,దాగా మల్లేష్ ,YSR T P కాశీ సతీష్ కుమార్ బెల్లంపల్లి నియోజకవర్గం ఇంచార్జి ,కల్పన జాగటి YSR TP మంచిర్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలు ,మనీ రామ్ సింగ్ బెల్లంపల్లి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లయ్య తెలుగుదేశం పార్టీ కార్యదర్శి బెల్లంపల్లి
హాస్పిటల్ సూపర్డెంట్ వైద్యులు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.