రామగుండం పోలీస్ కమిషనరేట్ డీసీపీ అడ్మిన్ అఖిల్ మహాజన్ కు మంచిర్యాల డీసీపీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ గా విధులు నిర్వహించిన ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ గా పదోన్నతి పొంది ఆదిలాబాద్ ఎస్పీగా బదిలీ అయ్యారు. ఈ క్రమంలో గతంలో మంచిర్యాల ఏసీపీగా పనిచేసి పదోన్నతిపై డీసీపీ అడ్మిన్ విధులు నిర్వహిస్తున్న అఖిల్ మహాజన్ కు మంచిర్యాల డీసీపీగా బాధ్యతలు అప్పగించారు.
అక్రమార్కులు గుండెల్లో దడ
మంచిర్యాల డీసీపీ గా అఖిల్ మహాజన్ బాధ్యతలు స్వీకరించగా అక్రమార్కుల గుండెల్లో దడ పుడుతుంది. గతం లో ఇక్కడ ఏసీపీ గా పని చేయగా అక్రమ దందాలు చేస్తున్నవారిపై ఉక్కు పాదం మోపారు. గుట్కా ,జూదం , బ్లాక్ దందా చేసే వారిపై దాడులు చేస్తూ వచ్చారు. దీంతో అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తోంది.