మోటర్ కార్మిక రంగాన్ని నష్టపరిచే 714 జీవోను వెంటనే రద్దు చేయండి: జేఏసీ

మహా వెలుగు న్యూస్ పెద్దపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చంద్ర కాంత్ 17 :మోటర్ కార్మిక రంగానికి నష్టపరిచే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 714 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో జేఏసీ లారీ, డీసీఎం యజమానుల సంఘం ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు. లారీ యజమానుల సంఘం అధ్యక్షులు కొయ్యడ సుధాకర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్, ఐఎస్టీయు జిల్లా అధ్యక్షుడు ఈదునూరి నరేష్, సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మోటార్ వెహికల్ చట్టంను నిర్వీర్యం చేస్తూ మోటార్ రంగ కార్మికులను, యజమానులను, వివిధ రకాల టాక్స్ ల పేరుతో వీధిపాలు చేయాలని, కుట్రలు చేస్తుందని అన్నారు. ఈనెల 19న రాష్ట్ర వ్యాప్తంగా రవాణా బంద్ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తో కల రమేష్, భాస్కర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, తోట శ్రీనివాస్, కోట వెంకన్న, పరుశురాం, సారయ్య, కంది శ్రీనివాస్, నాగరాజు, ఇ రవి, ఎగ్బాల్, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.