- ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
మహా వెలుగు ,హైదరాబాద్ 10 : రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది అక్కడ అక్కడ ఉరుములు మెరుపులు తో కూడిన వర్షం పడనుందని పేర్కొంది బుధవారం ఖమ్మం నల్గొండ సూర్యాపేట భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ ములుగు జయశంకర్ భూపాలపల్లి మంచిర్యాల జిల్లాలో అక్కడ అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది సోమవారం పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతం లోని తీవ్ర తుఫాను ఆగని పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి మంగళవారం ఉదయం కాకినాడకు ఆగ్నేయ దిశగా 260 కిలో మీటర్ల దూరంలో కేంద్రీ కృతమై ఉందని తెలిపింది.ఈ తీవ్ర తుపాను సుమారుగా వాయువ్య దిశగా పయనించి ఈ రాత్రి కి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉత్తర ప్రదేశ్ తీరానికి చేరుకునే అవకాశo ఉందని చెప్పింది.
