ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి G-23 అసమ్మతి నేతలు, వివిధ రాష్ట్రాల సీఎంలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఐదు రాష్ట్రాల పార్టీ ఇంచార్జ్‌లు, ఐదు రాష్ట్రాల పీసీసీ ప్రెసిడెంట్లు హాజరయ్యారు. దాదాపు రెండు గంటలపాటు జరిగిన సమావేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరిగినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో G-23 అసమ్మతి నేతలు పార్టీ సంస్థాగతంగా పార్టీని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. కాగా, ఈ సమావేశానికి మాజీ ప్రధాన మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ హాజరు కాలేదు. అనారోగ్య సమస్యల కారణంగానే ఆయన హాజరు కాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.