- ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన స్థానిక పోలీస్ లు
మహా వెలుగు, మంచిర్యాల 13 ; గత నాలుగు రోజుల కురుస్తున్న వర్షాలకు మంచిర్యాల – చెన్నూరు జాతీయ రహదారి రసూల్ పల్లి వద్ద ఉన్న లో లెవల్ వంతెన మునిగింది. దీనితో తెల్లవారు జాము నుండి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. గత కొంతకాలంగా అక్కడ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతుండగా అవి పూర్తి కాలేదు. దీనితో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. పోలీస్ లు ఇప్పుడు ఫైన్ లు వేయండి ,ప్రభుత్వ నిర్లక్ష్యం తోనే ఇలా జరుగుతుందని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.