- హత్య కేసులో ఇరికించాలని చూస్తున్నారని ఆవేదన
సెల్ఫీ వీడియో తీసుకొని మందు తాగి ఆత్మహత్యాయత్నo
మహా వెలుగు మంచిర్యాల 25 : నా చావుకు తాండూర్ సిఐ జగదీష్ , ఎస్ఐ కిరణ్ కుమార్ కారణమని నన్ను కావలసుకుని హత్యకేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ,తాండూర్ మండలం కాసిపేట గ్రామానికి చెందిన ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకొని మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే గత నెలలో మహేష్ అనే యువకుడు రైలు పట్టాలపై శవమై కనిపించాడు. అది అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో తమ పై హత్య కేసు నమోదు చేసేందుకు తాండూర్ సిఐ జగదీష్ , ఎస్ఐ కిరణ్ కుమార్ ప్లాన్ చేస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ మందు తాగాడు. కేవలం ఒక ఫన్నీ వీడియో ఆధారంగా తనపై కేసు నమోదు చేస్తున్నారని ఆ వీడియోలో తెలిపాడు. సాగర్ కార్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు మందు తాగిన అతన్ని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
