- పార్టీ మారుతున్నట్లు నిరాదారమైన కథనాలు ప్రసారం చేస్తే పరువు నష్టం దావా వేస్తా
KCR సారథ్యంలోనే ముందుకు వెళ్తా
-మాజీ MLC పురాణం సతీష్ కుమార్.
మహా వెలుగు మంచిర్యాల 02 : తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, చివరి శ్వాస వరకు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి KCR గారి సారథ్యంలోనే పని చేస్తూ ముందుకు సాగుతానని మాజీ MLC గౌరవ శ్రీ పురాణం సతీష్ కుమార్ స్పష్టం చేశారు. తాను TRS పార్టీ వీడుతున్నట్లు సాక్షి టీవీ లో వచ్చిన కథనం పూర్తి నిరాదరమని, ఇలాంటి వార్తలు ప్రసారం చేసిన, వార్తలు రాసిన పరువు నష్టం దావా వేస్తా అని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసులు నమోదైయ్యాయని లాఠీ దెబ్బలు తిని, జైలు కు సైతం వెళ్లానని తాను ఏనాడు కూడా పదవుల కోసం పని చేయలేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పని చేశానని వివరించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తనను గౌరవ KCR గ₹, KTR తనకు పార్టీ బాధ్యతలతో పాటు 6 సంవత్సరాలు MLC పదవిని సైతం ఇచ్చారని, అలాంటి పార్టీని తాను ఎలా విడుతానని MLC చెప్పారు.
తాను పార్టీ మారుతున్నట్లు ఏమైనా ఆధారాలు ఉంటే చూపాలని, ఎలాంటి ఆధారాలు లేకుండా వచ్చినట్లు వార్తలు ప్రసారం చేస్తే న్యాయపరంగా ఎదురుకుంటానాని సతీష్ కుమార్ చెప్పారు. పార్టీ కి ఒక సైనికుడిగా పని చేస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో TRS పార్టీ పటిష్టతకు కృషి చేసిన తన పై కొంత మంది కక్ష కట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఈ అసత్య ప్రచారాలు చేస్తున్నవారికి రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్తానని సతీష్ కుమార్ పేర్కొన్నారు.