మహా వెలుగు మంచిర్యాల : నేను పార్టీ మారుతున్నట్టు ఓ ఛానల్ ప్రసారం చేసిన కథనం పూర్తిగా అబద్ధం అని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ నల్లాల ఓదెలు శుక్రవారం తెలిపారు.తాము గులాబీ సైనికుణ్ణి, ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ బాటలోనే నడుస్తానని ,నాకు పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని అసంతృప్తి లేదని, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే విప్ సుమన్ నాయకత్వంలో చెన్నూరు అభివృద్ధి చెందుతోంది. ఆయనతోనే ఉంటాము.ఒక సామాన్య కుటుంబం లో పుట్టిన నన్ను టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదరించారని తెలిపారు. డబ్బులున్న అనేక మంది మహా మహులున్నా , నన్ను అక్కున చేర్చుకున్నారని, మూడు సార్లు చెన్నూరు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గా గెలిపించారు. ప్రభుత్వ విప్ గానూ అవకాశం ఇచ్చారు. నా శ్రీమతికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా అవకాశం ఇచ్చారు. తండ్రిలా ఆదరించిన కేసీఆర్ ను ,టిఆర్ ఎస్ పార్టీని నేను వీడుతున్నట్టు ప్రచారాలు చేసిన వారి పై ఇక పై చట్ట పరమైన చర్యలు తీసుకుంటమని తెలిపారు.
రాష్ట్రంలో అయిన జిల్లా లోనూ చెన్నూరు నియోజకవర్గంలోనూ టిఆర్ఎస్ తప్ప మరో పార్టీకి స్కోప్ లేదు. అదే విధంగా ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన నాకు వేరే పార్టీలో చేరే ఆలోచన అంతకన్నా లేదు. వార్తలు,ప్రచారాలు పునరావృతం అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిoచారు.