నల్గొండ జిల్లాలో కుప్పకూలిన హెలికాప్టర్‌

 నల్గొండ జిల్లా: పెదవూర మండలంలోని తుంగతుర్తి గ్రామాపంచాయితి పరిధిలో ఓ శిక్షణా హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో చాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందారు. ఫైలట్‌తోపాటు ట్రైనీ ఫైలట్ సజీవ దహనమయ్యారు. పెద్ద శబ్ధంతో హెలికాప్టర్‌ పేలిందని స్థానిక రైతులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకుంటున్న రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యటు చేపట్టారు.