నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నిధులు మంజూరు

  • ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బాల్క సుమన్

మహా వెలుగు , చెన్నూర్ 18 : చెన్నూరు నియోజకవర్గం లోని మందమర్రి, జైపూర్ అంగ్రజ్ పల్లి, కోటపల్లి, నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మరమ్మతులకు , నూతన భవనాల నిర్మాణానికి నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి హరీష్ రావు , ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కు లేఖ ద్వారా తెలియపరిచారు.

నియోజకవర్గంలోని నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రి హరీష్ రావు కు చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సౌకర్యం కోసమే నిధులు మంజూరు చేసినట్లు వారు తెలిపారు.