మహా వెలుగు మహబూబాబాద్ 31 : బీసీ మహిళ బిడ్డగా పుట్టడమే నేను చేసిన తప్పా.. మహిళననే చులకన భావంతో సొంత పార్టీకి చెందిన టీఆర్ఎస్ నేతలే వేధిస్తున్నారంటూ మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి ఉపసర్పంచ్ బొల్లు శిరీష సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. ”గ్రామ ఉప సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అభివృద్ధికి పనులకు కొంతమంది లీడర్లు ఏదో రకంగా అడ్డుపడుతున్నారంటూ ఆరోపించింది. నేను చేసిన తప్పు ఏముందో నిరూపించాలి. గ్రామ పంచాయతీలోని ఏడుగురు వార్డు సభ్యులు ఊరి అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. నాదగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి. కావాలనే అగ్రకుల పెత్తనం కోసం నన్ను మార్చాలని చూస్తున్నారంటూ” శిరీష సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుద లచేసింది.నేను ఊరుకోను ,మా బీసీ సామాజిక బిడ్డలను ఏకం చేస్తా.. ఎంతటి పోరాటానికైనా సిద్ధమంటూ ఘాటుగా స్పష్టంగా వెల్లడించడం గమనార్హం. అవిశ్వాస తీర్మానం ఆపండి లేకపోతే నేను చేసిన తప్పును నిరూపించండంటూ నిలదీసింది. నేను దోషినని తేలితే పార్టీ నుంచి నేను వెళ్లిపోవడంతో పాటు నా ఉపసర్పంచ్ పదవికి కూడా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తానని ప్రకటనలో తెలిపింది.