నేను మీ కాలనీకి రాను…

  • నేను మీ కాలనీ కి రాను
  • తండా వాసులతో భీమారo సర్పంచ్ గద్దె రాం రెడ్డి
  • మురుగు కాల్వ లో నీరు ఇంట్లో కి వస్తుంది అని చెప్పిన పట్టింపు కరువు
  • పంచాయతీ కార్యదర్శి ముందే మురుగు కాల్వ లో పడ్డ   చిన్నారి….

మహా వెలుగు మంచిర్యాల ,(భీమారo) 31 : నేను మీ కాలనీ కి రాను ..మీరు ఎమ్ అయిన చేసుకోండి ? … నేను ఎం చేయాలి ? అని ఓ గ్రామ పంచాయతీ సర్పంచ్ హుకుం జారీ.. ఇప్పుడు మీకు ఈ పని కాదు గ్రామ పంచాయతీ లో నిధులు లేవు అని అదే గ్రామ పంచాయతీ కార్యదర్శి కాలనీ వాసులకు తీర్పు..

భీమారo మండల కేంద్రానికి చెందిన లాంబడి తండా లో బాధిత కుటుంబాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…  భీమారo మండలo లొనే అతి పెద్ద గ్రామ పంచాయతీ భీమారo ఇక్కడ నిత్యo సమస్యల తో సతమతం అవుతున్నారు.

లాబండి తండా లో మురుగు నీరు ఇండ్ల లోకి చేరుతుందని తండా వాసులు గత కొన్ని రోజులుగా స్థానిక సర్పంచ్ గద్దె రాం రెడ్డి తో పాటు ,పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ కు తెలుపుతున్నారు. పంచాయతీ కార్యదర్శి తో పాటు ,సర్పంచ్ సైతం ఆ సమస్యను పరిశీలించారు. అనంతరం వదిలేశారు. పనులు చేయాలిసిన పంచాయతీ కార్యదర్శి పంచాయతీ లో నిధులు లేవని ప్రజలకే తెలుపుతున్నారు. “సర్పంచ్ మీ కాలనీ కి నేను రాను” అని హుకుం జారీ చేసి కూర్చున్నారు. 

లాంబడి తండాలో గత కొంతకాలంగా మురుగు నీరు బానోథ్ అమర్ సింగ్ నాయక్ , మదుకర్ నాయక్ ,లచ్చన్న  ఇంట్లోకి చేరుతుంది. వారు గత కొంతకాలంగా గ్రామ పంచాయతీ సిబ్బంది కి గాని , సర్పంచ్ గాని చెప్పిన పట్టించు కోవడం లేదని వాపోతున్నారు.  ఓ చిన్నారి మురుగు కాల్వలో మునుగగా స్థానికంగా ఉన్న పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ఆ చిన్నారిని బయటకు తీసినట్లు తండా వాసులు తెలుపుతున్నారు. రానున్నది వర్షాకాలం కావడం తో మరింత ప్రమాదం ఉన్నట్లు స్థానికులు తెలుపుతున్నారు.

మాకు న్యాయం చేయండి లేదా కలెక్టరేట్ కు వెళ్తాo

మురుగు కాల్వలో నీరును శుభ్రం చేయక పోతే తాము కలెక్టర్ కు ఫిర్యాదు ఇవ్వనున్నట్లు కాలనీ వాసులు తెలుపుతున్నారు. రానున్నది వర్ష కాలం కావడం తో డయేరియా , మలేరియా , విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని తమని ఆదుకోవాలని తమ సమస్యను త్వరగా తీర్చాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సర్పంచ్ ,పంచాయతీ కార్యదర్శి తీరుపై అసహనం

సర్పంచ్ ,పంచాయితీ కార్యదర్శి తీరుతో స్థానిక కాలనీ వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ కాలనీ కి సర్పంచ్ గద్దె రాం రెడ్డి ఎందుకు రారు అని ? తాము లాంబడి లు కాబట్టే సర్పంచ్ ఇలా వ్యవహరిస్తున్నారని సర్పంచ్ పై ఆగ్రహం వ్యక్తo చేశారు.