-వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి
నేరాలను నియంత్రించడంతో పాటు, శాంతి భద్రతలపై ప్రజలకు నమ్మకం కలగాలంటే విజుబుల్ పోలీసింగ్ తోనే సాధ్యపడుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులను పిలుపునిచ్చారు. వెస్ట్ జోన్ మరియు
సెంట్రల్ జోన్ పరిధిలోని కాజీపేట్ డివిజన్ కు చెందిన పోలీస్ అధికారులతో వరంగల్ పోలీస్ కమిషనర్ శు క్రవారం నేల వారి నేరసమావేశాన్ని నిర్వహించారు. వెస్ట్, సెంట్రల్ జోన్లకు చెందిన డిసిపితో పాటు ఏసిపిలు, ఇన్ స్పెక్టర్లు, సబ్-ఇనన్స్ స్పెక్టర్లు పాల్గొన్న ఈ నేర సమావేశంలో పోలీస్ స్టేషన్ వారిగా పెండింగ్ లో వున్న కేసులు, వాటి ప్రస్తుత స్థితిగతులు, నిందితుల అరెస్టు, కేసు దర్యాప్తు సంబంధించి వివరాలను పోలీస్ కమిషనర్ ఆయా స్టేషన్ ఆధికారులు, సర్కిల్ ఇన్ స్పెక్టర్ మరియు ఏసిపిలను పోలీస్ అడిగి తెలుసుకోవడంతో పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పనితీరుపై పోలీస్ కమిషనర్ ఈ సమీక్షా సమావేశంలో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పలు అంశాలపై పోలీస్ అధికారులకు పలుసూచనలు చేశారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ముందస్తూ సమాచారాన్ని సేకరించాల్సి వుంటుందని. అదే విధంగా గతంలో నేరాలకు పాల్పడిన నేరస్తుల సమాచారాన్ని సేకరించడంతో పాటు వారి ప్రస్తుత స్థితిగతులపై స్థానిక పోలీసులు ఆరా తీయాల్సి వుంటుందని. యువతను మత్తు బానిసలు కాకుండా చేసే ప్రయత్నంలో భాగంగా, గతంలో పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాల విక్రయాలతో పాటు రవాణాకు పాల్పడుతున్న వారిపై నజరు పెట్టాలని, ముఖ్యంగా గంజాయితో పాటు నిషేధిత పొగాకు ఉత్పత్తులను అమ్మకాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించడంతో పాటు వారిపై పీడీ యాక్ట్ క్రింద నమోదు చేయాలని పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. వెస్ట్ జోన్ మరియు కాజీపేట్ డివిజన్ పరిధిలో ప్రధాన రోడ్డు మార్గం విస్తీరణం అధికంగా వుండటంతో ఈ మార్గాల్లో రోడ్డు ప్రమాదాల నివారణ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమయిన ముందస్తు చర్యలు తీసుకోంటూ ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలతో పాటు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలని పోలీస్ కమిషనర్ తెలియజేసారు.
ఈ సమావేశంలో సెంట్రల్ జోన్, వెస్ట్ జోన్ డిసిపిలు, అశోక్ కుమార్, సీతారాం, వర్ధన్నపేట, స్టేషన్ ఘనపూర్ మరియు కాజీపేట ఏసిపిలు రమేష్, రఘుచందర్, శ్రీనివాస్ తో పాటు ఇన్ స్పెక్టర్లు, సబ్-ఇన్స్ స్పెక్టర్లు పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయము
