నేతకానిలకు అండగా దుర్గం అశోక్

మహా వెలుగు మంచిర్యాల 25 : నేతకానిలకు అండగా దుర్గం అశోక్ మరో సారి నిలబడ్డారు. మంచిర్యాల జిల్లా ,భీమారo మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన యువకుడు సోమవారం ప్రయివేట్ సంస్థ యజమానిని నమ్మి మోసపోయి ట్రైన్ కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఆకుదారి మనోహర్ (27) కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించారు. అనంతరం వారి తల్లిదండ్రులకు రూ. 5వేలు ఆర్థిక సహాయం చేసి, వారి కుటుంబానికి అండగా నిలబడుతనని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోదారి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.