రెండు నిండు ప్రాణాలకు అండగా సుమన్

మహా వెలుగు , చెన్నూర్ 14 : రెండు నిండు ప్రాణాలకు అండగా చెన్నూర్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ నిలబడ్డాడు. మంత్రి కేటీఆర్ కు తెలిపి ఏకంగా హెలికాప్టర్ ద్వారా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

వివరాలకు వెళ్తే చెన్నూరు మండలం సోమన్ పల్లి వద్ద గోదావరి కి ఉదయం పూట ఎడ్ల కోసం వెళ్లారు. వరద ఉధృతంగా ప్రవహించడంతో అక్కడే ఉన్న నీళ్ల ట్యాంక్ ను వారెక్కారు వారి దగ్గర సెల్ ఫోన్ లు కూడా లేవు అక్కడ స్థానికులు గమనించి విప్ సుమన్ కు సమాచారం అందించారు. నిమాషాల వ్యవధి లోనే స్పందించిన విప్ సుమన్ నదిలోకి చిక్కుకున్న ఇద్దరిని కాపాడడానికి మంత్రి కేటీఆర్ తో మాట్లాడి హెలికాప్టర్ ను తెప్పించి ఇద్దరి ప్రాణాలకు అండగా నిలిచి వారి కుటుంబాలకు తోడుగా నిలిచారు.

భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సహాయక చర్యలను స్వయంగా దగ్గర ఉండి పర్యవేక్షించి వారిని సేఫ్ గా ఇంటి కి చేర్చారు. దీనితో నియోజకవర్గ ప్రజలు విప్ సుమన్ ను కొనియాడారు. ఆయన చేసిన పనికి గతం లో ఏ నాయకుడు చెయ్యని పని సుమన్ చేస్తున్నాడని స్థానికుల తో పాటు నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.