నిండు ప్రాణానికి అండగా నిలవండి

మహా వెలుగు చెన్నూరు 16 : కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామ సమీపంలో గురువారం రోజున జరిగిన రోడ్డు ప్రమాదంలో తుంగ రాజపోశం మృతి చెందగా, అదే కుటుంబానికి చెందిన మరో ముగ్గురికి తీవ్ర గాయలయిన విషయం పాఠకులకు విధితమే. ఈ ప్రమాదంలో తుంగ రాజేశ్వరి(32) అనే మహిళ పరిస్థితి విషమించడంతో ఆమెకు జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె ఆరోగ్య రీత్యా మెరుగైన వైద్యం అందించాల్సి ఉండగా, ఆమె భర్త ఉన్న ఒక్క ఇల్లూ, భూమిని అమ్మి వైద్యం చేపిస్తుండగా, లక్షల వరకూ ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. తమది రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితని, ఆమెకి వైద్య సదుపాయాలు అందించేందుకు తమ వద్ద ఇంకేమి మిగిలి లేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఎవరైనా తమయందు దయతలచి అండగా నిలవాలని, రాజేశ్వరికి వైద్యం అందించడంలో సహాయం అందించాలని వారు కోరుతున్నారు.