మహా వెలుగు పెద్దపల్లి జిల్లా 28 : యువతీ, యువకులకు శుభవార్త త్వరలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలు జరగనున్న క్రమంలో పోలీసు, సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో యువతీ, యువకులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని ఆసక్తి కలిగిన యువతీ
యువకులు ఆయా పోలీస్ స్టేషన్లలో పూర్తి వివరాలను
అందజేయాలని తెలిపారు. త్వరలో శిక్షణ కేంద్రాల
వివరాలను ప్రకటిస్తామన్నారు.
