మహా వెలుగు, చెన్నూర్, ఆగష్టు 01: పట్టణంలో 2.05 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన KGBV పాఠశాల భవనం ప్రారంభించిన ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు.
ముఖ్యమంత్రి గారి కృషితోనే నేడు ఈ భవనాన్ని ప్రారంభించుకున్నాం.
పాఠశాల కు సంబంధించిన మౌలిక సదుపాయాలకు, మెయిన్ రోడ్ నుండి పాఠశాల వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయిస్తాము.
విద్య వైద్యం కోసం 30 వేలకు పైగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్.
వెయ్యికి పైగా రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
ఒక్క విద్యార్థి మీద ప్రతి సంవత్సరం లక్షా 20 వేల రూపాయలు కేటాయిస్తున్నాం.
మన ఊరి మన బడి పథకం తో రాష్ట్ర పాఠశాలలు అన్నింటిని బాగా చేసుకుంటున్నాము.
విద్యార్థులు గొప్పగా చదువుకుని ప్రభుత్వానికి, తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలి.
మార్కులే లక్ష్యంగా కాకుండా మానసికంగా దృఢంగా ఉండడం కోసం కూడా చదవాలి.
ఈ సందర్భంగా ఇదే కళాశాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినిలకు బహుమతులు అందించారు.
