- నీ భార్య జడ్పీ చైర్పర్సన్ గా ఉండి దళితులకు ఏం చేసినవ్ నిరూపించాలి
- ఏ ఒక్కరికైనా దళితులకు పదవులు ఇచ్చినవ
- బాల్క సుమన్” పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు
- దళిత కాలనీ వాసులు
మహా వెలుగు , మంచిర్యాల భీమారo 05 : నువ్వు మూడు సార్ల ఎమ్మెల్యే అయి దళితవాడలకు ఏం చేసినావ్ …. ? ఏనాడు దళితులను దగ్గర పెట్టుకున్నావా…. ? పదవులు ఇచ్చినవా….. ? నువ్వు ఏ వర్గాలకు పని చేసినవో మాకు తెలియదా అని అంబేద్కర్ కాలనీ వాసులు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
శనివారం రాత్రి ఓ కార్యక్రమానికి వచ్చిన ఓదెలు బాల్క సుమన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయగా ఆదివారం అంబేద్కర్ కాలనీ వాసులు ,మహిళలు సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా తగరం వెంకటస్వామి , వడ్లకొండ పవన్ మాట్లాడుతూ….
భీమారం లోని అంబేద్కర్ కాలనీ తెలుసా! అని అనడం సిగ్గుతో తల దించే విషయమని నియోజకవర్గం లో 3 సార్లు MLA గా గెలిచి అభివృద్ధి చేసింది లేక విప్ సుమన్ పై ఆరోపణలు చేయడం సరికాదని తెలిపారు.
విప్ సుమన్ ఆద్వర్యంలో వాడ వాడల CC రోడ్స్,వాటర్ బోర్లు వేయించడం జరిగిందని వేల కోట్ల డబ్బు ఉన్న వ్యక్తుల పై టిఆర్ఎస్ పార్టీ తరుపున నిన్ను ఎమ్మెల్యే గా పోటీ గా నిలబెట్టి నిన్ను గెలిపించారాని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లో చేరగానే సుమన్ బయపడుతుండు అనడం సమంజసం కాదని
“”ఆవాలు తిన్నోళ్లకు ఏవలు తోస్తాయని అన్నట్టు భయం ఓదెలుకు అయి సుమన్ భయపడుతున్నాడు అనడం అనడం సిగ్గు చేటన్నారు.
భీమారం గ్రామంలో ప్రతీ వాడ లో రోడ్డు కావాలి అని అడగగానే 52 cc రోడ్లు వేయించడం జరిగిందని అది సుమన్ తోనే సాధ్యం అయిందని నీకు అవకాశం ఉన్న మా దళిత కాలనీలకు కనీసం ఎం చేయలేదన్నారు. నల్లాల ఓదెలు మీరు మా ఊరికి పగటిపూట వస్తే దగ్గరుండి మీరు 3సార్లు గెలిచిన చేసిన పనులెన్ని…. ?
ఒకసారి గెలిచి విప్ సుమన్ చేసిన పనులెన్ని ప్రజల ముందుకు వెళ్లి చూపిస్తామన్నారు. మీరు ఇలాంటి ఆరోపణలు చేస్తే నిన్ను అడుగు అడుగున అడ్డుకుంటామని ఏ ఒక్క కాలనీ ల్లో తిరగనియమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత మహిళలు పాల్గొన్నారు.
