మహా వెలుగు చామరాజనగర్ ఆగష్టు 01:ప్రియుడిని కలిసేందుకు ఇంటి నుంచి పారిపోయి వచ్చిన ఓ మైనర్‌కు సాయం చేస్తానని నమ్మించాడు కానిస్టేబుల్. అనంతరం ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: తన ప్రేమ విషయం ఇంట్లో తెలిసిపోవడం వల్ల జులై 25న ఇంటి నుంచి పారిపోయింది 17 ఏళ్ల మైనర్. తన ప్రియుడిని కలిసేందుకు బెంగళూరుకు బయలుదేరింది. బాధితురాల్ని విజయనగర్‌లోని ఓ పార్క్‌లో చూశాడు కానిస్టేబుల్ పవన్. ఆమెతో మాటలు కలిపాడు. ప్రియుడిని కలిసేందుకు చామరాజనగర్ జిల్లా యళందూర్ వెళ్లాలనుకున్నట్లు పవన్‌కు బాధితురాలు తెలిపింది.
ప్రియుడిని కలిసేందుకు సాయం చేస్తానని నమ్మించి కానిస్టేబుల్.. బాలికను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను చామరాజనగర్‌లో వదిలేశాడు. యళందూరు చేరుకున్న బాధితురాలు జరిగిన విషయమంతా తన ప్రియుడితో చెప్పింది. బాధితురాలు కెంపాపుర అగ్రహార పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని శుక్రవారం అరెస్టు చేశారు. ప్రస్తుతం నిందితుడు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.
