మహా వెలుగు , హైదరాబాద్ 14 : మన తెలుగు వాళ్ళ పై ఉన్న పగ తో ఒక్క బీహార్ వ్యక్తి నిచపు ఆలోచన చేశాడు. తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి…
బీహార్ రాష్టానికి చెందిన సూరజ్ (27) అనే వ్యక్తి హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద పాని పూరి వ్యాపారం చేసే వాడు , తనుకు ఈ ప్రాంతానికి చెందిన వారు మర్యాద ఇవ్వలేదు అని చాలా రోజులుగా ఒక నీచపు పని చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. సూరజ్ ఇంకా ఏడుగురితో పని పూరి అమ్మే కుర్రవాళ్ళు కలిసి అఫ్జల్గాంజ్ లో ఒక రూములో అద్దెకి ఉన్నారు. వారు ఉదయం అంతా పానీ పూరి తయ్యారు చేసి సాయంత్రం వాటిని అమ్మే వారు. వారు పానీ పూరి తయ్యారు చేసే సమయంలో రూం పై అంతస్తు లో అద్దెకు ఉన్న వ్యక్తి అనుకోకుండా వారిని గమనించాడు. వారు చేస్తున్న పని చూసి ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. అదేంటంటే ఒక జగ్గు లో ఉచ్చ పోసి దానిని వారు తయ్యారు చేసిన పానీ లో కలుపుతున్నారు. కాసేపు వారు చేస్తున్న పనిని గమనించి పోలీసులకు పిర్యాదు చేశాడు పై వాటాలో అద్దెకు ఉన్న వ్యక్తి. వారిని అదుపులోకి తీసుకొని పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. వారు చెప్పిన మాటలు విని పోలీసులు బిత్తరపోయారు. తమకు ఇక్కడున్న వారు ఎవరూ సరిగ్గా మర్యాద ఇవ్వటం లేదని కక్షతో ఉన్న సూరజ్ సలహా మేరకు వారు తినే పానీపూరి లో తమ మూత్రం కలుపుతున్నామని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి వారిని రిమాండ్ కి చేసినట్లు సమాచారం.