పదవీ విరమణ సహజం.

మహా వెలుగు న్యూస్ రిపోర్టర్ గోపాలకృష్ణ జన్నారం :31: ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, సిబ్బందికి పదవి విరమణ సహజమేనని పోనకల్ సర్పంచు జక్కు భూమేష్ అన్నారు.

పోనకల్ గ్రామపంచాయతీ లో కామాటి గా పనిచేస్తున్న రాజం పదవి విరమణ పొందుతున్న సందర్భంగా మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో రాజం దంపతులను గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

పదవీ విరమణ అనంతరం తన శేష జీవితాన్ని పిల్ల పాపలతో సుఖంగా గడపాలని కోరారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్,వార్డు సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు.