పది పరీక్షలు ప్రారంభం

మహా వెలుగు న్యూస్ జన్నారం రిపోర్టర్ గోపాల కృష్ణ 23 :పదవ తరగతి వార్షిక పరీక్షలు సోమవారం రోజు ప్రారంభమయ్యాయి.విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయడానికి మండల కేంద్రంలో నాలుగు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.కరోనా కారణంగా రెండేళ్ల నుంచి పదవతరగతి పరీక్షలు నిర్వహించలేదు. ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టడంతో పరీక్షలు నిర్వహించారు.పరీక్షా కేంద్రాల సమీపంలో ఎస్.ఐ సతీష్ 144 సెక్షన్‌ అమలు చేశారు.విద్యా ర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని మండల విద్యాధికారి విజయ్ కుమార్ పేర్కొన్నారు.మొత్తం 725 మంది విద్యార్థులకు గాను మొదటి రోజు14 మంది పరీక్షలకు హాజరు కాలేదని తెలిపారు.ఫ్లయింగ్ స్క్వార్డ్ భీమ్ రావు పరీక్షా కేంద్రాలను సందర్శించారు.