పల్లె దావాఖానాల్లో పనిచేయుటకు డాక్టర్ ల నియామకం

వి. కపిల్ కుమార్,మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్ ,మహబూబాబాద్, ఏప్రిల్ – 23: పల్లె దవాఖానాల్లో పనిచేయుటకు అర్హులైన డాక్టర్లను వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించి శనివారం నలుగురు డాక్టర్ల కు నియామక పత్రాలను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజు అందజేశారు. అంతేకాకుండా ఎం సి డి ప్రోగ్రామ్ కింద ఒక వైద్యాధికారి నియమించడం జరిగిందనీ, నియమించబడిన డాక్టర్లకు నెలకు 52 వేల రూపాయలు పారితోషికం అందిస్తామని అంతేకాకుండా జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా వచ్చే సూచనలను పాటిస్తూ పల్లె దవాఖానాల్లో పనిచేయాల్సి ఉంటుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు.

ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న అధికారులు

ఇట్టి కార్యక్రమంలో జిల్లా ఉప వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అంబరీషా, డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎక్స్టెన్షన్ అండ్ మీడియా ఆఫీసర్ కొప్పు ప్రసాద్, సెక్షన్ అధికారి సావిత్రి లు పాల్గొన్నారు.