నదితీరoకు వెళ్లి..చుక్కల మందులు వేసి..

కోటపల్లి : పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు బాధ్యత గా వ్యవహరించే వైద్య సిబ్బంది సోమవారం ప్రాణహిత నది తీరానికి వెళ్లి చుక్కల మందు వేశారు. మండలంలోని వెంచపల్లి గ్రామ సమీపంలోని ప్రాణహిత వద్ద మత్య్స కారులు వలస వచ్చి నివాసముంటున్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా హెల్త్ అసిస్టెంట్ పబ్బ సుధాకర్ గౌడ్ ,ఏఎన్ఎం మాధవి నదితీరం వద్దకు వెళ్లి చిన్నారులకు చుక్కల మందు వేశారు. బాధ్యత తో పాటు మంచి మనుసు ఉన్న అధికారులను మండల ప్రజలు అభినందించారు.