పెద్దపల్లి, మహా వెలుగు 25: రామగుండం కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న 19 మంది సబ్ ఇన్స్‌పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మంథనిలో పని చేస్తున్న చంద్రకుమార్‌ను మందమర్రికి, రామకృష్ణాపూర్‌లో పని చేస్తున్న సుధాకర్‌ను బీమారంకు, బీమారంలో పని చేస్తున్న అశోక్‌ను రామకృష్ణాపూర్‌కు, చెన్నూరులో పని చేస్తున్న వెంకటస్వామిని కోటపల్లికి, కోటపల్లిలో పని చేస్తున్న రవికుమార్‌ను వీఆర్‌కు, మందమర్రిలో పని చేస్తున్న రాజశేఖర్‌ను నెన్నెలకు, మంచిర్యాలలో పని చేస్తున్న గంగారాంను కాసిపేటకు, కాసిపేటలో పని చేస్తున్న నరేశ్‌ను వీఆర్‌కు, మాదారంలో పని చేస్తున్న సమ్మయ్యను తాండూరుకు, బెల్లంపల్లిలో పని చేస్తున్న జీవన్‌ను ఎన్‌టీపీసీకి, అంతర్గాంలో పని చేస్తున్న శ్రీధర్‌ను రామగుండం సీసీఎస్‌కు, రామగుండంలో పని చేస్తున్న సంతోష్‌కుమార్‌ను అంతర్గాంకు, లక్షెట్టిపేటలో పని చేస్తున్న హమాను మాదారంకు, మందమర్రిలో పని చేస్తున్న భూమేశ్‌ను వీఆర్‌కు, ఎన్‌టీపీసీలో పని చేస్తున్న స్వరూప్ రాజ్‌ను వీఆర్‌కు, కాల్వశ్రీరాంపూర్‌లో పని చస్తున్న వెంకటేశ్వర్లును మంథనికి, నెన్నెలలో పని చేస్తున్న సౌమ్యను వీఆర్‌కు, తాండూరులో పని చేస్తున్న కిరణ్‌కుమార్‌ను వీఆర్‌కు, వీఆర్‌లో ఉన్న రాజేందర్‌ను రామగుండం ట్రాఫిక్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.