పాముకాటుతో మహిళ మృతి

మంచిర్యాల జిల్లా నేన్నెల మండలం కొత్తూరు గ్రామానికి చెందిన మహిళ పాముకాటుతో మృతి చెందినట్లు గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపారు.
స్థానికులు, తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బండారి శంకర్- పల్లవి( 28 )భార్యాభర్తలు కాగా కొత్తూరు లో నివాసముంటున్నారు పల్లవిని పాము కాటు వేయడంతో ఆమె మృతి చెందినట్లు తెలుస్తుంది కాగా మృతురాలికి కూతురు ఉంది పల్లవి సొంత గ్రామం భీమారం మండలం కాజిపల్లి , కాజిపల్లి లో విషాదఛాయలు అలుముకున్నాయి.