పామ్ ఆయిల్ తోటలు ప్రతి ఒక్కరు పెట్టాలి

మహా వెలుగు మంచిర్యాల : ఆయిల్ పామ్ తోటల పై ప్రతి ఒక్కరి కి అవగాహన కలిగి ఉండాలని ,ప్రతి ఒక్క రైతు తోటలు పెట్టాలని ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. భీమారo మండలo లోని తాళ్లగూడెం లో బాల్క సుమన్ తోట వద్ద కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రతి ఒక్క రైతు దాని వైపు మొగ్గు చూపాలని తెలిపారు. రేపు జరుగా బోయే ధర్నా ను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కలగూర రాజ్ కుమార్ , భిమారo సర్పంచ్ గద్దె రాం రెడ్డి ,ఆయా గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, సర్పంచ్ లు ,నాయకులు పాల్గొన్నారు.