పంట రుణాలు రెన్యువల్ చేసుకోండి

– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా           
  భీమారం శాఖ
– కార్యనిర్వహణ అధికారి  డేవిడ్

మహా వెలుగు ,భీమారo 31 :  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భీమారం శాఖ రైతు ఖాతాదారులకు విజ్ఞప్తి , మీ క్రాప్ లోన్ (పంట రుణాన్ని) సకాలంలో వడ్డి చెల్లించి ,  రెనివల్ చేసుకోవాలనీ SBI భీమారం శాఖ కార్యనిర్వహణ అధికారి డేవిడ్ తెలిపారు.

క్రాప్ లోన్ సకాలంలో రినివల్ చేసుకోవడం వలన  కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించే వడ్డి రాయితీని పోందవచ్చని వారు తెలిపారు. సకాలంలో  పంట రుణాన్ని రెనివల్ చేసుకోని రైతులు అదీక వడ్డి  చెల్లించాల్సి వస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే  వడ్డి రాయితీ పోందలేరనీ మరియు క్రాప్ లోన్ ఖాతా ఒక సారి మొండి బకాయిగా మారినట్లయితే , మీ సిబిల్ స్కోర్ లో డిఫాల్టర్ గా చూపిస్తుందనీ భవిష్యత్తులో మరల కొత్త రుణాలు పొ oదడానికి అనర్హులు అవుతారనీ వారు తెలిపారు. కావున  రైతు ఖాతాదారులందరు బ్యాంకులో క్రాప్ లోన్ రినివల్ కోరకు ఏర్పాటు చేసిన  ప్రత్యేక కౌంటర్ లలో క్రింద తెలిపిన పత్రాలతో సంప్రదించగలరని వారు తెలిపారు.

క్రాప్ లోన్ రినివల్ కోరకు కావల్సిన ధృవపత్రాలు

1)కలర్ ఫోటో-1
2)ఆదార్ కార్డు జిరాక్స్
3)పట్టాదార్ పాస్బుక్ జిరాక్స్
4) పహానీ లేదా 1(బి)