- ప్రధాన రహదారులు, సెంట్రల్ లైటింగ్, జంక్షన్ల అభివృద్ధి తదితర అంశాలపై జైపూర్ STPP లో HKR & NH63 & R&B అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రభుత్వ విప్
మహా వెలుగు ,చెన్నూర్ 19 : పనులపై అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ,చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని రాజీవ్ రహదారికి సంబంధించి గోదావరి నది బ్రిడ్జి నుండి ఇందారం క్రాస్ రోడ్డు వరకు సెంట్రల్ లైటింగ్, అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, మొక్కలు నాటడం, బ్యూటిఫికేషన్
పనులు ఎక్కడి వరకు వచ్చాయని ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అడిగి తెలుసుకున్నారు.

చెన్నూర్ నియోజకవర్గ పరిధి లోని ప్రధాన రహదారులు, సెంట్రల్ లైటింగ్, జంక్షన్ల అభివృద్ధి తదితర అంశాలపై జైపూర్ STPP లో HKR & NH63 & R&B అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రభుత్వ విప్ ఈ సందర్భంగా మాట్లాడుతూ…

NH 63 పరిధిలోని ఇందారం క్రాస్ రోడ్ నుండి అర్జున గుట్ట వరకు..జైపూర్, భీమారం మండల కేంద్రాలలో సెంట్రల్ లైటింగ్, రోడ్ల వెడల్పు, సుందరీకరణ, జంక్షన్ల అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొక్కల పెంపకం, ఫుట్ పాత్ ఏర్పాటు చేయాలన్నారు. పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో HKR & NH63 & R&B ఏజెన్సీ ప్రతినిధులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గున్నారు.
