పార్థివ దేహానికి నివాళులర్పించిన
డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్

మహావెలుగు కురవి/మే2 రిపోర్టర్ చల్ల వేణు : మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని నల్లెల్ల గ్రామానికి చెందిన స్థానిక సర్పంచ్ యర్రం రెడ్డి సుధాకర్ రెడ్డి సోదరుడు క్రిష్ణ రెడ్డి సతీమణి మరణించడంతో నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చిన డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ మాట్లాడుతూ…. ఆధైర్య పడవద్దని ధైర్యంగా ఉండాలని వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరారు.

వారి వెంట జిల్లా నాయకులు బజ్జురి పిచ్చిరెడ్డి, జిల్లా టిఆర్ఎస్వి నాయకులు గుగులోతు రవి నాయక్, కురవి మండల అధ్యక్షులు తోట లాలయ్య, దొడ్డ గోవర్ధన్ రెడ్డి తదతరులు నాయకులు కార్యకర్తలు పాల్గొనారు.