పట్టణ చౌరస్తాలో మరమ్మతు పనులు ప్రారంభం

మహా వెలుగు, పెద్దపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చంద్ర కాంత్ 20 : గోదావరిఖని పట్టణం ప్రధాన చౌరస్తాలో నగర సుందరీకరణలో భాగంగా మరమ్మతు పనులను
ప్రారంభించారు. చౌరస్తాను విస్తరించడంతో పాటు తెలంగాణ అమరవీరుల స్థూపం ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పెరుగుతున్న ట్రాఫిక్ అనుగుణంగా చౌరస్తాలో మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు ఇటీవల నగర మేయర్ అనిల్ కుమార్ సంబంధిత అధికారులతో చౌరస్తా ప్రాంతాన్ని పరిశీలించారు.