పట్టణ పేదలకు ఉపాధి పనులు కల్పించాలి

  • పేదల ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలి
  • తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య .

వి. కపిల్ కుమార్ మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్ మహబూబాబాద్.11:మహబూబాబాద్ పట్టణం లో నిరుపేదలన్దరికీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను కేరళ తరహాలో కల్పించి ఆదుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహబూబాబాద్ తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా పోరాడి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే చర్యలకు కేంద్ర, రాష్ట్ర పాల్పడుతున్నాయని,కేంద్ర బడ్జెట్ లో రెండు లక్షల కోట్లు కేటాయించాల్సి వుండగా గత సంవత్సరం 89 వేల కోట్లు కేటాయించి ఈ సంవత్సరం అందులో నుండే 25 వేల కోట్లు తగ్గించిందని వారన్నారు.

ఉపాధిలో క్షేత్ర సహాయకులను నేటికీ విధుల్లోకి తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.

మార్చి 15న,అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫీల్డ్ అసిస్టెంట్సల ను విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చి రెండు నెలలు గడుస్తున్నా నేటికీ విధుల్లోకి తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని వారన్నారు.


జిల్లా వ్యాప్తంగా పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇచ్చి పక్కాగా డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, 57 సంవత్సరాల పైబడిన వారందరికీ పెన్షన్ ఇవ్వాలని, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని, పోడు సాగు దారులపై అధికారుల వేధింపులు ఆపి హక్కు పత్రాలు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.