పెద్దపల్లి జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం

మహా వెలుగు న్యూస్ పెద్దపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చంద్ర కాంత్ 23 : పెద్దపల్లి జిల్లాలో కలకలం రేపుతున్న క్షుద్ర పూజలు. సుల్తానాబాద్ మండలం తొగర్రాయి పాండవుల గుట్టలో గుర్తు తెలియని
వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. ప్రముఖ వెబ్ సైట్ కథనం ప్రకారం.. పాండవుల విగ్రహాలను తొలగించి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఆ తవ్విన చోట గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలను సైతం నిర్వహించారు. కోరిన కోర్కెలు తీర్చే దేవతలుగా పాండవులను గ్రామస్తులు నమ్ముతారు. తవ్వకాలు జరిపిన వ్యక్తులను పట్టుకొని చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.