పెంచిన విద్యుత్,గ్యాస్, నిత్యావసరాల ధరలను తగ్గించాలి.- సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ,AIKMS డిమాండ్

మహబూబాబాద్ ప్రతినిధి. 8 : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని స్థానిక MRO ఆఫీసు ముందు పెంచిన విద్యుత్, గ్యాస్, నిత్యావసరాల చార్జీలు తగ్గించాలని కోరుతూ ధర్నా నిర్వహించి, MRO గారికి వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీమైదాన మండల కార్యదర్శి మాదంశెట్టి నాగేశ్వరరావు, AIKMS మండల అధ్యక్షుడు రామగిరి బిక్షం మాట్లాడుతూ… టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ బావుల దగ్గర మీటర్లు పెట్టబోమని, అవసరమైతే కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తామని చెపుతూ… మరోపక్కన విద్యుత్ చార్జీల ధరలు పెంచుతూ సామాన్యులకు వెలుగులు దూరం చేస్తుంది అన్నారు.

సామాన్యులు వేసవికాలం వచ్చి పనిదొరకక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారనీ దీనికి తోడు రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టకపోగా ఇప్పుడు విద్యుత్ చార్జీలు పెంచడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు.


వంట నూనె 100/- రూపాయల నుండి 200/- రూపాయలుగా పెంచి మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్లుగా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కావున రాష్ట్ర ప్రభుత్వం చిత్త శుద్ధితో పెంచిన విద్యుత్ చార్జీల భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశలవారీగా ఆందోళనలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో PYL నాయకుడు తుడుం వీరభద్రం,aikms మండల నాయకులు దొడ్డి తిర్మలేష్, వీరభద్రం,బుచ్చయ్య,సంగయ్య,యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.