పర్మిషన్ ఎవరు ఇచ్చారు…?

మహా వెలుగు , మంచిర్యాల ప్రతినిధి భీమారo 23 : మంచిర్యాల జిల్లా భీమారo మండల కేంద్రంలో దీపావళి టపాకాయల వ్యాపారానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు… ? అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీపావళి టపాకాయల వ్యాపారానికి ముఖ్యంగా గ్రామ పంచాయతీ తో పాటు , పోలీస్ లు , ప్రధానంగా ఫైర్ డిపార్ట్మెంట్ అనుమతులు తప్పనిసరి కానీ అధికారుల అతి ఉత్సాహం , ప్రోత్సాహంతోనే భీమారo లో టెంట్లు వేసి మరి టపాకాయల దుకాణాలను అధికారికంగా తెరిచినట్లు ప్రజలు పేర్కొంటున్నారు.

ప్రమాదం పొంచి ఉన్న పర్మిషన్ ఎవరు ఇచ్చారు.. ?

మంచిర్యాల – చెన్నూర్ ప్రధాన రహదారి పై టెంట్లు వేసి మరి పాటకాయల దుకాణాలను తెరువగా అసలు వాటికి జన సముదాయంలో పర్మిషన్ ఎవరు ఇచ్చారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం మూడు రోజుల వ్యాపారం కదా అని ప్రజల రక్షణ ను పాటకుల మంటల్లో పడేసి ఏకపక్షంగా అధికారులు మామూళ్లు తీసుకొని టపాకులు పెట్టుకుందుకు అనుమతులు ఇచ్చారని తెలుస్తోంది.

పర్మిషన్ తీసుకున్న వారి పరిస్థితి ఏంటి ?

కాగ మంచిర్యాల , చెన్నూర్ , సీసీ , శ్రీరాంపూర్ ప్రాంతాల్లో పర్మిషన్ తీసుకొని పెట్టిన వారి పరిస్థితి ఏంటి అని అక్కడ టపాకులు నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పర్మిషన్ తీసుకొని తాము టపాసులు పెట్టుకుంటే పర్మిషన్ లేకుండా వారినికి ఎలా అనుమతులు ఇచ్చారని నిర్వహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము గవర్నమెంట్ కు డబ్బులు కట్టి పర్మిషన్ తీసుకుంటే ? వారికి ఎలా ఇచ్చారని తాము నష్ట పోతున్నట్లు వారు తెలుపుతున్నారు.

ఫైర్ డిపార్ట్మెంట్ పాత్ర కీలకం

టపాకాయల పెట్టాలంటే ముఖ్యంగా ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి కానీ ఇక్కడ ఎలాంటి పర్మిషన్ లేకుండా జన సముదాయం లో టపాసులు పెట్టి నిర్వహిస్తున్నారు. వారి పై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.