- మార్కెట్ కమిటీ చైర్మన్ బజ్జురి ఉమా పిచ్చిరెడ్డి.
మహావెలుగు కురవి ఏప్రిల్24:రిపోర్టర్ చల్ల వేణు
కురవి మండల కేంద్రంలోని సిద్ధార్థ ఉన్నత పాఠశాలలోని విద్యార్థుల ఫేర్వెల్ పార్టీ కి ముఖ్యఅతిథిగా మహబూబాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బజ్జూరి ఉమా పిచ్చి రెడ్డి పాల్గొని ప్రసంగించారు, విద్యార్థిని విద్యార్థులు కౌమార దశ నుండి కష్టంగా కాకుండా ఇష్టపడుతూ చదవాలని, అలా చదివితేనే ,ప్రథమ స్థానంలో రాణించి పాఠశాలకు గ్రామానికి, జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి పేరుప్రఖ్యాతులు తెచ్చి, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని వారు ఆకాంక్షించారు. పిల్లల భవిష్యత్తు బంగారు బాట కావాలంటే విద్యాప్రమాణాలు పెంచుకోవాలని కోరారు. తదనంతరం అతిధులకు స్కూలు కరస్పాండెంట్ అల్వాల కార్తీక్ దంపతులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుగులోత్ పద్మావతి రవి నాయక్,స్థానిక సర్పంచ్ నూతక్కి పధ్మానరసింహారావు, తెరాస యూత్ రాష్ట్ర నాయకులు గుగులోత్ రవి నాయక్.ఉపాధ్యాయిని,ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు
