పీకే టీం సర్వే అక్కడ సిట్టింగ్ కు పూర్తి సానుకూలత…

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పీకే టీమ్ సర్వే చేస్తుంది. ఖానాపూర్ బోద్ , ఆసిఫాబాద్ ,మంచిర్యాల ,ముధోల్ లో ప్రతికూల పవనాలు వీస్తున్న ట్లు తెలుస్తుంది .ఈ నియోజకవర్గాల్లో మండలాల వారీగా సర్వే చేసిన సర్వే లో ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతో పాటు ఇతర అంశాలు నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సర్వే ఆధారంగానే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు కేటాయింపు ఉంటుందని ప్రచారం. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దడ పుట్టిస్తోంది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు పలు నియోజకవర్గాల్లో అసెంబ్లీ టికెట్లను ఆశిస్తున్న వారంతా నిత్యం ప్రజల మధ్యే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మరోపక్క ప్రశాంత్ కిషోర్ టీం జనం పక్కన సర్వే కార్డులు పట్టుకొని తిరుగుతుంది. టిఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరును వారు అనుకుంటున్నారు. పనిలో పనిగా కేసీఆర్ పై ఉన్న అభిమానం విపక్షంలోని ముఖ్య నేతలకు ప్రజాదరణ బలాబలాలు ,ఏమిటని, బలహీనతలు ,ఏమిటనే విషయంపై అభిప్రాయాన్ని పీకే టీం సేకరిస్తుంది. దీనిలో భాగంగా పీకే టీం సర్వే జిల్లాల్లో కొనసాగుతుందని , తెలిసిన ఎమ్మెల్యేలు జనానికి దగ్గర కావాలని ఏదో ఒక కార్యక్రమం చేపడుతున్నట్లు సమాచారం.

పరామర్శలు , కష్టసుఖాలు క్రీడా పోటీలు , సేవా కార్యక్రమాలు , ఓదార్పు యాత్రలు , ప్రజల్లోకి వెళ్లి తమకంటూ ఓ క్యాడర్ ఉందని నిరూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే అధిష్టానం పెద్దలతో టచ్ లో ఉంటూ తమ పని తాము చేసుకొని వెళ్తున్నారు.

చెన్నూర్ సిటింగ్ కే సానుకూలత

అదిలాబాద్ జిల్లాలో పికే టీం సర్వే ఎమ్మెల్యేలను హడలెత్తిస్తున్న ఇందులో భాగంగానే చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కు పూర్తి సానుకూలత ఉన్నట్లు సర్వేలో తేలిందని విశ్వసనీయ సమాచారం. అదిలాబాద్ , నిర్మల్ సిరిపూర్ , బెల్లంపల్లి నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ , బిజెపికి , కాంగ్రెస్ ,కు చాలా దగ్గర ఉన్నట్లు తేలిందట ?