- రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి
- పోలీస్ సిబ్బంది కి ఆరోగ్య కార్డుల పంపిణీ
మంచిర్యాల మహా వెలుగు 17 : పోలీస్ లు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తేనే సమర్థవంతంగా విధులు నిర్వహిస్తారని, అప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తారని రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మెడి లైఫ్ ఆస్పత్రి యాజమాన్యం పోలీసు సిబ్బందికి గురువారం ఉచితంగా హెల్త్ కార్డులను అందజేసింది. మెడిలైఫ్ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రామగుండం పోలీసు కమిషనర్ ఎస్. చంద్రశేఖర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైరు. రామగుండం పోలీసు కమిషనరేట్ లోని మంచిర్యాల జోన్ పరిధిలో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది, అధికారులకు ఉచితంగా ఆరోగ్య కార్డులను అందజేశారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ….చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు కరీంనగర్, హైదరాబాద్ లలో ఆరోగ్య భద్రత ఉన్న హాస్పిటల్ కి వెళ్లలేము. కాబట్టి అందువల్ల లోకల్ హాస్పిటల్ లో ఛెక్ చేసుకోవాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ సిబ్బందికి చికిత్స సమయంలో ఫీజు రాయితీ మెడిలైఫ్ హాస్పిటల్ అందించారు. చైర్మన్ డాక్టర్ నూతన్ అరవింద్ హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్లకు కృతజ్ఞతలతో పాటు అభినందించారు పోలీస్ సిబ్బంది కూడా చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉండాలని ఆరోగ్యం గా ఉన్నప్పుడే ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించే అవకాశం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అఖిల్ మహాజన్ ఐపిఎస్, మంచిర్యాల ఏసీపీ ఎస్ రష్మీ పెరుమాళ్ ఐపిఎస్, బెల్లంపల్లి ఏఆర్ ఏసీపీ మల్లికార్జున్, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ నారాయణ, మహిళ పిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్ఐ అనిల్, డాక్టర్స్ కుమార్ స్వామి, చైతన్ చౌహన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.