మహా వెలుగు , పెద్దపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చంద్ర కాంత్ 21 : రామగుండం పోలీస్ కమీషనరెట్ హెడ్ క్వార్టర్స్ లో గోదావరిఖని సబ్ డివిజన్ సివిల్ పోలీస్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బందికి శనివారం వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్ కి రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి హాజరై గౌరవ వందనం స్వీకరించి తరువాత సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్, ట్రాఫిక్ డ్రిల్, సెర్మొనల్ డ్రిల్ సిబ్బంది ప్రదర్శనలను పరిశీలించారు.
సీపీ మాట్లాడుతూ, ఈ మధ్య కాలంలో ఆరోగ్య కారణాలు, రోడ్డు ప్రమాదం వల్ల సిబ్బంది మరణించడం బాధాకరమన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, యోగ, ధ్యానం, నడక ఏదో ఒకటి చేయాలని, సాధ్యమైనంత వరకు బయట ఆహారం తినడం మానివేయాలని. రెగ్యులర్ హెల్త్ చెకప్ చేసుకోవాలని సీపీ తెలిపారు.
ఈ పరేడ్ లో గోదావరిఖని ఏసిపి గిరి ప్రసాద్, ఏఆర్ ఏసీపీ సుందర్ రావు, ఆలు మధుకర్, శ్రీధర్, విష్ణు ప్రసాద్ గోదావరిఖని 1టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, రాజ్ కుమార్, గోదావరిఖని 2 టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు, రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ కనతల లక్ష్మీనారాయణ, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ, ఆర్ఎస్ఐలు, సిబ్బంది హాజరయ్యారు.
