టేకు ఫైల్ ఫోటో
- అటవీశాఖ అధికారులు లీకులు ఇవ్వడం తోనే ఓ వ్యక్తి బెదిరింపులు
- బూరుగుపల్లి లో పంచాయతీ అనంతరం పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన బాధితులు
- పేర్లు గోప్యంగా ఉంచాల్సిన అధికారులు లీక్ చేశారు
- చంపుతానని బెదిరిస్తున్న స్మగ్లర్
మహా వెలుగు,మంచిర్యాల ,భీమారo 06 : పొలీస్ స్టేషన్ కు చేరిన టేకు పంచాయితీ బాధితులు స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమారం మండలం బూరుగుపల్లి గ్రామంలో గత 2 రోజుల క్రితం అధిక మొత్తంలో టేకు కలపను రేపస్వాధీనపరుచుకున్నారు. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దగ్గర టేకు కలప దొరికింది. గుర్తుతెలియని వ్యక్తులు అడవి శాఖ అధికారులకు సమాచారం అందించగా వారు వచ్చి దాడులు చేసి పట్టుకున్నారు. కాగా అడవి శాఖ అధికారులు మాత్రం వారికి సమాచారం అందించిన వారి పేర్లను బహిర్గతం చేశారని దీంతో ఆ గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది.
టేకు స్మగ్లర్ పేరును అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చెప్పారని వారికి వార్నింగ్ ఇచ్చాడు దీంతో ఆ పంచాయతీ సోమవారం వారం పోలీస్ స్టేషన్ దాకా చేరింది.
గోప్యంగా ఉంచాల్సిన అధికారులే పేర్లు బహిర్గతం చేస్తారా
గోప్యంగా ఉంచాల్సిన అధికారులే పేర్లు బహిర్గతం చేస్తారా అని బాధితులు బూరుగుపల్లి వాసులు అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.