పోలీసులు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి

  • తెలంగాణ చీప్ ఆఫ్ ఆపరేషన్ ప్రభాకర్ రావు
  • కోటపల్లి, నీల్వాయి, కన్నెపల్లి పోలీస్ స్టేషన్ లను సందర్శించిన చీప్ ఆఫ్ ఆపరేషన్ SIB తెలంగాణ

మహా వెలుగు ,మంచిర్యాల 16 పోలీస్ లు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని , అప్రమత్తంగా ఉండాలని
తెలంగాణ చీప్ ఆఫ్ ఆపరేషన్ ప్రభాకర్ రావు సిబ్బంది కి సూచించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఉన్న మంచిర్యాల , చెన్నూరు రూరల్ పరిధిలోని కోటపల్లి , నీల్వాయి, కన్నెపల్లి పోలీస్ స్టేషన్ లను ప్రభాకర్ రావు, చీప్ ఆఫ్ ఆపరేషన్ SIB తెలంగాణ మంచిర్యాల ఇన్చార్జి డిసిపి అఖిల్ మహాజన్ ఐపిఎస్ గారి తో కలిసి పోలీస్ స్టేషన్ లను సందర్శించి నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం లను పరిశీలించి అధికారులతో ప్రస్తుత పరిస్థితిల ను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది తో మాట్లాడటం మాట్లాడుతూ సిబ్బంది ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎట్టిపరిస్థితులలో అలసత్వం ప్రదర్శించావద్దన్నారు. సిబ్బంది ఆత్మ స్థైర్యంతో ఉండాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. పోలీసులు విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, ప్రజల భద్రత పోలీస్ బాద్యత అని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో సందర్శించి ప్రజల అవసరాలు, సమస్యలు తెలుసుకోవాలని చట్టపరిధిలో పరిష్కరించాలని, పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ తమ తమ విధులు క్రమశిక్షణతో నిర్వహించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ నరేందర్, సీఐ చెన్నూర్ రూరల్ విద్యాసాగర్, కోటపల్లి ఎస్ఐ వెంకట్, నీల్వాయి ఎస్ఐ నరేష్ కన్నెపల్లి ఎస్ఐ సురేష్ లు పాల్గొన్నారు.